Abn logo
Oct 4 2021 @ 07:03AM

Shaheen: తుపాన్ ఎఫెక్ట్..ఇరాన్,ఒమన్‌లలో 9 మంది మృతి

మస్కట్ : షహీన్ తుపాన్ కారణంగా ఇరాన్, ఒమన్ దేశాల్లో 9మంది మరణించారు.షహీన్ తుపాన్ ప్రభావం వల్ల ఒమన్ దేశంలోని తీరప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల ఒమన్ దేశంలో ఇద్దరు మరణించారు. మరో చిన్నారి వరదల్లో కొట్టుకుపోయింది.మస్కట్ ప్రావిన్స్‌లోని రుసైల్ పారిశ్రామిక ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు ఆసియా కార్మికుల మృతదేహాలను రెస్క్యూ బృందాలు వారి ఇంటి నుంచి బయటకు తీశాయని ఒమన్ నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ (ఎన్‌సిఇఎమ్) తెలిపింది. ఒమన్ ఉత్తర తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. 

రాజధాని నగరమైన మస్కట్ లో వరదనీరు నిలచింది.ఇరాన్‌లోని సముద్రం మీదుగా సిస్తాన్-బలుచెస్తాన్ ఆగ్నేయ ప్రావిన్స్‌లోని చాబహార్ పోర్టులో తుపాన్ వల్ల ఆరుగురు మరణించారని డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్‌ చెప్పారు.ఇరాన్ దేశంలో తుపాన్ ధాటికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. తుఫాను కన్ను ప్రావిన్స్ తీరానికి 220 కిలోమీటర్లు (130 మైళ్ళు) దూరంలో ఉందని అలీ నిక్జాద్ చెప్పారు. షహీన్ తుపాన్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా హై అలర్ట్ ప్రకటించింది.మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే కొన్ని విమానాలను ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.ఒమన్ దేశం ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జాతీయ సెలవు ప్రకటించింది. సెలవు సందర్భంగా పాఠశాలలను మూసివేశారు.


ఇవి కూడా చదవండిImage Caption