బ్రెజిల్‌లో 19 రకాల కరోనా వైరస్ వేరియెంట్లు

ABN , First Publish Date - 2021-06-17T14:14:13+05:30 IST

బ్రెజిల్ దేశంలోని సావో పాలోలో కరోనావైరస్ యొక్క 19 రకాలను గుర్తించినట్లు...

బ్రెజిల్‌లో 19  రకాల కరోనా వైరస్ వేరియెంట్లు

రియో డి జనీరో (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలోని  సావో పాలోలో కరోనావైరస్ యొక్క 19 రకాలను గుర్తించినట్లు బ్రెజిల్ జీవ పరిశోధన కేంద్రమైన ఇన్‌స్టిట్యూటో బుటాంటన్ ఒక ప్రకటనలో తెలిపింది. సావోపాలో రాష్ట్రంలో అత్యధికంగా 46 మిలియన్ల మంది జనాభా ఉండగా, వారిలో అత్యధిక కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. సావోపాలో రాష్ట్రంలో పి1  అమెజోనియన్ జాతి వైరస్ కేసులు 89 శాతం బయటపడ్డాయి.బి117 యూకే స్ట్రెయిన్ వైరస్ 4.2 శాతం కేసులు నమోదైనాయి. బ్రెజిల్ దేశంలో రష్యాకు చెందిన స్ఫుత్నిక్ వి కొవిడ్ వ్యాక్సిన్లు జులై ఆరంభంలో వేస్తామని బ్రెజిల్ రాష్ట్ర సియారా గవర్నర్ కామిలో సాంటానా  చెప్పారు.

Updated Date - 2021-06-17T14:14:13+05:30 IST