Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరైన సమయంలో... సరైన మోతాదు

‘గీతం’లో ఔషధ వినియోగంపై అమెరికా నిపుణుడి సూచన 

పటాన్‌ చె రు రూరల్‌,  డిసెంబర్‌ 2: ఔషధాలను సూచించిన పద్ధతిలో.. అంటే  సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోవాలని అమెరికాలోని హాట్స్‌ స్పాట్‌ థెరప్యూటిక్స్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంప్యూటేషనల్‌ సైన్స్‌ అధిపతి డాక్టర్‌ ఆర్డిన్‌ డెన్నీ పేర్కొన్నారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో ‘ఔషధాల ఆవిష్కరణలో సవాళ్లు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఔషధాలను సరిగా వినియోగించకపోతే ఆరోగ్యం మరింత క్షీణించడమే కాకుండా కొన్నిసార్లు మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదన్నారు. దీర్ఘకాలిక పరిస్థితులను నియంత్రించడానికి, తాత్కాలిక పరిస్థితులకు అనుగుణంగా చికిత్స చేయడానికి దీర్ఘకాలిక ఆరోగ్యం  శ్రేయస్సును దృష్టిలో  పెట్టుకుని ఔషధ వినియోగం ఉండాలని ఆయన సూచించారు. సరిగా మందులు మింగితే కొన్నాళ్ల తరువాత వాటిని తక్కువ మోతాదులో వాడడం లేదా పూర్తిగా నిలిపివేయడమో జరుగుతుందన్నారు. మందుల వినియోగంపై కొన్ని చిట్కాలను ఆయన వివరిస్తూ... ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవాలని, అందుకు సంబంధించిన సూచనలను ఔషధాలతో పాటు ఉంచుకోవాలని సరైన మోతాదులోనే వినియోగించాలన్నారు. అలాగే ఔషధ ఆవిష్కరణలో ఉన్న దశలను కూడా ఆయన విశదీకరించారు. తొలుత స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీవీ రామారావు అతిథిని స్వాగతించడంతో పాటు సభకు పరిచయం చేసి సత్కరించారు. కార్యక్రమంలో ఐజెన్‌ బయో ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రెజ్‌ జాన్‌, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ సురేంద్రబాబు, కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్‌ రాంబాబు గుండ్ల, డాక్టర్‌ నరే్‌షకుమార్‌ కటారి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement