Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ గుడిలో మటన్ బిర్యానీయే ప్రసాదం.. ఏళ్ల తరబడి ఇదే ఆచారం.. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందంటే..

 ప్రసాదం.. ఒక్కో గుడిలో ఒక్కోలా ఉంటుంది. తిరుపతి అనగానే టక్కున లడ్డూ గుర్తొస్తుంది. అలాగే శబరిమలలో డబ్బాలో అందించే అరవణ ప్రసాదానికి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇలా ఒక్కో గుడిలో ఒక్కో రకంగా ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. చాలా ఆలయాల్లో లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి తదితరాలను ప్రసాదంగా అందించడం అందరికీ తెలిసిందే. అయితే.. ఆ గుడిలో మాత్రం మాంసాహారాన్నే ప్రసాదంగా అందిస్తారు. షాక్ అయ్యారు కదా.. మీరు వింటున్నది నిజమే, మనం చెప్పుకోబోయే గుడిలో భక్తులకు బిర్యానీని ప్రసాదంగా అందిస్తారు. వినడానికి వింతగా ఉన్న ఈ ఆలయ విశేషాల్లోకి వెళితే..


బిర్యానీని ప్రసాదంగా పంచే ఆలయం.. మన దేశంలో ఉందంటే నమ్మడం కష్టమే. కానీ అలాంటి ఆలయం మన దేశంలో, అదీ మన పొరుగు రాష్ట్రంలోనే ఉంది. అక్కడి ఆలయంలో ఉత్సవాల సమయంలో రోజూ 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. సుమారు 84 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అదే తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయం. మునియాండి అంటే శివుడి సేవకుడని అర్థం. ఈ ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. 


అప్పట్లో ఎస్పీఎస్ సుబ్బనాయుడు మునియాండి అనే పేరుతో ప్రారంభించిన హోటల్‌కి లాభాలు రావడంతో ఆ యజమాని.. స్వామి భక్తులకు రెండేళ్ల పాటు బిర్యానీని ప్రసాదంగా పంపిణీ చేస్తానని మొక్కుకున్నారు. తర్వాత స్థానికులంతా బిర్యానీ వండి.. పంచిపెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి ఏడాదీ జనవరి 24నుంచి రెండు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కనుంచో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. అయినా వచ్చిన భక్తులందిరికీ.. ఆలయ సిబ్బంది ఓపిగ్గా బిర్యానీని అందిస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులూ బిర్యానీనే ప్రసాదంగా అందిస్తారు. మరోవిశేషం ఏంటంటే.. ఈ బిర్యానీని పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఈ మునియాండీ స్వామికి వివిధ దేశాల్లోనూ భక్తులు ఉన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement