‘ఆటా’ కొవిడ్ సహాయం.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-06-03T20:56:31+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను యూఎస్ నుంచి తెలుగు రాష్ట్రాలకు పంపింది. ‘మేము అమెరికాలో ఉన్నప్పటికి స్వదేశం గురించే ఆలోచి

‘ఆటా’ కొవిడ్ సహాయం.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ

వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను యూఎస్ నుంచి తెలుగు రాష్ట్రాలకు పంపింది. ‘మేము అమెరికాలో ఉన్నప్పటికి స్వదేశం గురించే ఆలోచిస్తాం. ఇండియాలో కొవిడ్ అల్లకల్లోలంతో దిగ్బ్రాంతికి గురవుతున్నాం. కొవిడ్ బాధితుల కోసం 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నాం. ఇదే కాకుండా మా వంతు సహాయాన్ని తప్పకుండా చేస్తాం. త్వరగా ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యమైన డాక్టర్లు కూడా తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొవిడ్‌ బాధితులకు "జూమ్" అప్ ద్వారా సహాయం అందించేందుకు ఓ కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. www.eglobaldoctors.com వెబ్‌సైట్‌ను విరివిగా ఉపయోగపర్చుకోవాలిసిందిగా విజ్ఞప్తి చేశారు. 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తెలంగాణలోని వరంగల్, ములుగు, కరీంనగర్, బాన్స్వాడ, జడ్చెర్ల, మహబూబ్‌నగర్, అచ్చంపేట, నారాయణపేట, వనపర్తి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రిలకు అందించినట్టు చెప్పారు.



ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వానికి అందజేసినట్టు చెప్పారు. ఆటా ప్రతినిధులు కృష్ణ రెడ్డి, లోహిత్ రెడ్డి, జ్యోత్స్నా, జ్యోతిర్మయి, డా.శివ భరత్, శ్రీనివాస్ బండారి తదితరులు పంపిణీ బాధ్యతలు నిర్వహించారు. ఆటా కార్యనిర్వహక మండలి మరియు బోర్డు సభ్యులు.. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రాణాలు పణంగ పెట్టి సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను ఆటా కార్యవర్గం కొనియాడింది. 


Updated Date - 2021-06-03T20:56:31+05:30 IST