Abn logo
Aug 5 2021 @ 15:13PM

చెట్లను అక్రమంగా నరికి రోడ్డున వేశారు: అచ్చెన్నాయుడు

అమరావతి: విశాఖ ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌ను తరలించేందుకు వైసీపీ నేతలు 14 కి.మీ. మేర వేలాది చెట్లను అక్రమంగా నరికి రోడ్డున వేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌కు నిబంధనలను ఉల్లఘించి చెట్లను నరుకుతున్నారని అన్నారు. తెల్లపోనంకి చెట్ల నుంచి మడ అడవుల వరకు అన్నీ నరికేశారని మండిపడ్డారు. ప్రభుత్వం నాటిన మొక్కల్ని సంరక్షిస్తూ రాష్ర్టంలో పర్యావరణాన్ని కాపాడేందుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలన్నారు.