ఆ సెక్షన్లు చెల్లవని ఆనాడే చెప్పాం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-07-15T22:03:21+05:30 IST

ఏబీఎన్‌పై పెట్టిన రాజద్రోహం కేసు అక్రమమని, ఆ సెక్షన్లు చెల్లవాని ఆనాడే చెప్పామని అచ్చెన్న అన్నారు.

ఆ సెక్షన్లు చెల్లవని ఆనాడే చెప్పాం: అచ్చెన్నాయుడు

అమరావతి: ఏబీఎన్‌పై పెట్టిన రాజద్రోహం కేసు అక్రమమని, ఆ సెక్షన్లు చెల్లవాని తాము ఆనాడే చెప్పామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మాట్లాడే స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. అయినా పత్రికా స్వేచ్ఛను ఎలా హరిస్తారని ఆయన ప్రశ్నించారు. గురువారం టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు.


ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రాలో అనేకమైన సమస్యలు ఉన్నాయన్నారు. జగన్‌రెడ్డి దొంగ, దోపిడీ దారు అని చెబుతున్నానని, తనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని, అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలను జగన్‌రెడ్డి ఇప్పుడు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. సీఎం వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాల రాస్తున్నారని, ఆ సెక్షన్లు చెల్లవని ఎప్పుడో చెప్పామన్నారు. ఇవాళ సీజేఐ వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యం బతికే ఉందని తేలిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.


జగన్‌ పాలనలో రైతులు క్రాఫ్‌ హాలిడేకి వెళ్తున్నారని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా అనంతర పరిస్థితులు, జాబ్‌ క్యాలెండర్‌, సాగునీటి సమస్యపై పొలిట్‌బ్యూరోలో చర్చిస్తామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చేతులు కలిపినప్పుడు నీళ్ల సంగతి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. సీఎం అయిన వెంటనే హైదరాబాద్‌లోని సచివాలయం.. ఏపీ ఆస్తులను ఎలా ఇచ్చేశారని నిలదీశారు. నీళ్ల సంగతి తేల్చకుండా పుడింగిలా వెళ్లి ఆస్తులు ధారాదత్తం చేశారని, జగన్‌ ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ నాటకాలు ఆపి నీళ్లపై నోరు విప్పాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2021-07-15T22:03:21+05:30 IST