Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీపీ అడిగి...డబ్బులు కొట్టేసి!


ఖాతాలో నగదు మాయం

కరోనా మృతుల కుటుంబసభ్యులకు టోకరా

గంట్యాడ మండలంలో రెండు ఘటనలు 

గంట్యాడ, నవంబరు 23: ‘మేం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాం. మీ గ్రామంలో కరోనా మృతుల వివరాలు తెలపండి’..అంటూ కొర్లాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఆమె ఓ బాధితురాలితో మాట్లాడించారు. ఫోన్‌లో ఉన్న వ్యక్తి బాధితురాలి ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు తెలుసుకున్నారు. ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ నంబరు తీసుకున్నాడు. అక్కడికి కొద్దిసేపటికే బాధితురాలి ఖాతా నుంచి రూ.80 వేల నగదు మాయమైంది. బోనంగిలో కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్‌ వచ్చింది. వివరాలన్నీ సేకరించి.. ఓటీపీ నంబరు తెలుసుకున్న మరుక్షణమే బాధితుడి ఖాతా నుంచి రూ.21 వేలు మాయమైంది. దీంతో ఇది సైబర్‌ నేరమని గుర్తించిన బాధితులు గంట్యాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Advertisement
Advertisement