అథ్లెటిక్స్‌ బామ్మ మన్‌కౌర్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2021-08-01T09:17:06+05:30 IST

శతాధిక వృద్ధురాలు, వెటరన్‌ స్ర్పింటర్‌ మన్‌కౌర్‌ (105) గుండెపోటుతో శనివారం కన్నుమూసింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. హరియాణాకు చెందిన కౌర్‌కు ...

అథ్లెటిక్స్‌ బామ్మ మన్‌కౌర్‌ ఇకలేరు

చండీగఢ్‌: శతాధిక వృద్ధురాలు, వెటరన్‌ స్ర్పింటర్‌ మన్‌కౌర్‌ (105) గుండెపోటుతో శనివారం కన్నుమూసింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. హరియాణాకు చెందిన కౌర్‌కు ‘మిరాకిల్‌ మామ్‌ ఫ్రమ్‌ చండీగఢ్‌’గా పేరుంది. 93 ఏళ్ల వయసులో మన్‌ కౌర్‌ రన్నింగ్‌ రేసులో పాల్గొనడం ప్రారంభించింది. 2007లో పటియాలాలో జరిగిన ‘చండీగఢ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌’లో కౌర్‌ తొలి పతకం సాధించింది. 2017లో ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో 100 మీటర్ల స్ర్పింట్‌లో వరల్డ్‌ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పోలెండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లోనూ ఆమె ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ స్వర్ణం నెగ్గింది. 

Updated Date - 2021-08-01T09:17:06+05:30 IST