క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , First Publish Date - 2021-12-03T06:02:21+05:30 IST

క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిం చాలని కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్వేత అన్నారు.

క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
హ్యాండ్‌బాల్‌ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారిణులు

  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్వేత  

 ఎస్‌యూ పరిధిలో హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం


కరీంనగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 2: క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిం చాలని కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్వేత  అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన శాతవాహన యూని వర్సిటీ స్థాయి అంతర్‌ డిగ్రీ కళాశాలల హ్యాండ్‌బాల్‌ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో 22 డిగ్రీ కళాశాలల నుంచి 80 మంది పురు షులు, 50 మంది మహిళా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు  ప్రతిభ చాటి శాతవాహన యూనివర్సి టీ పేరు నిలపాలన్నారు. అనంతరం పోటీలను నిర్వహించి భారతీదాస్‌ యూనివర్సిటీలో జరిగే మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలకు, అలాగే కాలికట్‌ యూనివర్సిటీలో జరిగే పురుషుల హ్యాండ్‌బాల్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. డిగ్రీ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు జి శ్రీధర్‌రావు, నాగేశ్వ ర్‌రావు, డాక్టర్‌ కె రవికుమార్‌, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, అశోక్‌పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:02:21+05:30 IST