Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 7: జిల్లాఅథ్లెటిక్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో క్రాస్‌కంట్రీపోటీలకు క్రీడాకారు లను ఎంపిక చేసినట్లు అసొసియేషన్‌ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సట్ల శంకర్‌ తెలిపారు. అండర్‌-16,18,20 వయస్సుగల క్రీడాకారుల కు వేర్వేరుగాపోటీలు నిర్వహించి ఎంపిక నిర్వహించి నట్లు తెలిపారు. రాష్ట్రపోటీలకు అండర్‌-16 విభాగంలో వి పాండు, ఎం సరూర్‌, డి హారిక, కె సౌమ్య, అండ ర్‌-18 విభాగంలో డి రవితేజ, జె నవీన్‌, టి అనూష, పి వైశాలి, అండర్‌-20 విభాగంలో అర్కమాను, ఎ యశ్వంత్‌రావు, ఎ నరేష్‌, బిచంద్రశేఖర్‌, సీహెచ్‌ కిశోర్‌, ప్రవీణ్‌ కుమార్‌, మహేశ్వరి, కె పవన్‌కుమార్‌, కె శంకర్‌, ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, హేమలత ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 19న కరీంనగర్‌లోని స్టేడియంలో నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ రహీం, కోచ్‌ విద్యాసాగర్‌, సంఘం కోశాధికారి లక్ష్మణ్‌, కృష్ణమూర్తి, రఘు, పీడీలు యాదగిరి, కె స్వప్న పాల్గొన్నారు. 

Advertisement
Advertisement