Abn logo
Aug 2 2020 @ 12:08PM

మామకు మద్యం తాపి.. గ్రామ సమీపంలోని రోడ్డుమీదకు తీసుకెళ్లి..

అట్లూరు(కడప): మండల పరిధిలోని వలసపాలెం గ్రామంలో ఉండే డేరంగుల వెంకటసుబ్బయ్య తన మామ చంద్రగిరి శ్రీనివాసులపై దాడి చేసి గాయపర్చినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. శనివారం వెంకటసుబ్బయ్య తన మామకు మద్యం తాపి వలసపాలెం గ్రామ సమీపంలోని కళ్లు రోడ్డుమీదకు తీసుకెళ్లి దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు. అతనిని స్థానికులు 108 వా హ నం ద్వారా బద్వేల్‌కు తరలించారు. వెంకటసుబ్బయ్యపై కేసునమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement