Abn logo
Jan 17 2021 @ 06:44AM

రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌ ఏటీఎం కార్డు చోరీ.. 60 వేలు డ్రా

హైదరాబాద్/బర్కత్‌పుర : ఓ రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌ ఏటీఎం కార్డును తస్కరించిన ఓ గుర్తు తెలియని దొంగ రూ.60 వేలను డ్రా చేశాడు. న్యూనల్లకుంటలో నివాసం ఉంటున్న రాజశేఖర్‌(68) రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌. తులసీనగర్‌లోని ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉంది. ఈ నెల 9న ఏటీఎం సెంటర్‌కు డబ్బులు డ్రాచేయడానికి వచ్చిన రాజశేఖర్‌ను మాయమాటలతో నమ్మించి, ఏటీఎం కార్డును తీసుకుని నకిలీ కార్డును చేతిలో పెట్టాడు. ఈనెల 11న ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన రాజశేఖర్‌కు ఎంతకూ డబ్బులు డ్రా కాకపోవడంతో పక్కనే ఉన్న ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లాడు. ‘ఇది నకిలీ ఏటీఎం కార్డు. నీ ఖాతాలో ఉన్న రూ.60 వేలు డ్రా చేశారు’ అని బ్యాంక్‌ సిబ్బంది తెలిపారు. శనివారం కాచిగూడ పీఎస్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement