ఆత్మకూరుకు షటిల్‌ టోర్నమెంట్‌ కప్‌

ABN , First Publish Date - 2022-01-25T02:50:07+05:30 IST

మండలంలోని కొత్తూరు బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో జరిగిన షటిల్‌ టోర్నమెంట్‌లో ఆత్మకూరు జట్టు

ఆత్మకూరుకు షటిల్‌ టోర్నమెంట్‌ కప్‌
కప్‌ అందుకుంటున్న జట్టు

ఇందుకూరుపేట, జనవరి 24 : మండలంలోని కొత్తూరు బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో జరిగిన షటిల్‌ టోర్నమెంట్‌లో ఆత్మకూరు జట్టు  కప్పును కైవసం చేసు కుంది. మూడు రోజులు జరిగిన ఈ పోటీల్లో సోమవారం బహుమతి ప్రదానం చేశారు. మొదటి స్థానంలో ఆత్మకూరు నిలిచి కప్‌ సాధించింది. ఇన్విటేషన్‌ షటిల్‌ టోర్నమెంట్‌ పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కి బహుమతులను అల్లూరు చంద్రశేఖర్‌రెడ్డి, పెనుబల్లి శరత్‌కుమార్‌రెడ్డి, ఆల్తూరి రవీంద్రరెడ్డిలు అందజేశారు. ఈ టోర్నమెంటులో మొత్తం 50 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంటులో విజేతలకు కైలాసం శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. నిర్వాహకులు రవి, సందానిబాషా, నేతాజీ, రాజా, దిలీప్‌, రాజా, అలీ, వెంకటేశ్వర్లు, కొత్తూరు బ్యాడ్మింటన్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T02:50:07+05:30 IST