వారానికి నాలుగే పనిదినాలు.. జీతంలో కోతల్లేకుండానే.. ఉద్యోగులకు ఓ బ్యాంకు ఆఫర్

ABN , First Publish Date - 2021-11-30T00:36:22+05:30 IST

బ్రిటన్‌కు చెందిన ఓ బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తమ సంస్థలోని ఉద్యోగులు కావాలనుకుంటే వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయచ్చని పేర్కొంది.

వారానికి నాలుగే పనిదినాలు.. జీతంలో కోతల్లేకుండానే.. ఉద్యోగులకు ఓ బ్యాంకు ఆఫర్

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం తీసుకొచ్చిన మార్పుల్లో వర్క్ ఫ్రం హోం ముఖ్యమైనది. దీని కారణంగా ఇంటి నుంచే ఉద్యోగాలు చేసేందుకు అలవాటు పడ్డ ప్రజలు ఇదే విధానాన్ని కొనసాగించాలని తమ కంపెనీల యాజమాన్యాలను కోరుతున్నారు. మరికొందరు మాత్రం వారానికి పనిదినాల సంఖ్య తగ్గించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఓ బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తమ సంస్థలోని ఉద్యోగులు కావాలనుకుంటే వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయచ్చని పేర్కొంది.  ఆటమ్ అనే బ్యాంకు తన ఉద్యోగులకు ఇటువంటి వినూత్న ఆఫర్ ఇచ్చింది. అయితే..ఆఫర్ పేరిట కంపెనీ జీతంలో కోతలకు పాల్పడకపోవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే..పనిదినాల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులు ప్రతిరోజు మరికొంత సమయం అదనంగా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే..గతంలో ఉద్యోగులు వారానికి 34 గంటలు పనిచేస్తుంటే ప్రస్తుతం వారు 37.5 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది.  

Updated Date - 2021-11-30T00:36:22+05:30 IST