Abn logo
Sep 19 2021 @ 01:31AM

మరో 18 మందికి కరోనా

అనంతపురం వైద్యం సెప్టెంబరు 18: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 18 మంది కరోనా బారిన పడగా.. ఎవరూ మరణించలేదు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,57,497కి చేరింది. అందులో 1092 మంది మరణించగా.. 1,56,323 మంది కోలుకున్నారనీ, 82 మంది చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.