Abn logo
Jun 14 2021 @ 01:06AM

1002

వెయ్యి దాటిన కరోనా మరణాలు

కొత్తగా 367 మందికి పాజిటివ్‌.. మరో నలుగురు మృతి

అనంతపురం వైద్యం, జూన్‌ 13: జిల్లాలో కరోనా మరణాలు వెయ్యి దాటాయి. అధికారిక లెక్కల మేర కు ఆదివారం నాటికి మహమ్మారికి ఏకంగా 1002 మంది బలయ్యారు. గతేడాది మార్చి చి వరిలో కరోనా కేసులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు 603 మంది కరోనాతో మరణించినట్లు అధికారులు చూపించారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచి వేగంగా పెరుగుతూ వచ్చింది. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ ఇప్పటివరకు 105 రోజుల్లో 399 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1002కి చేరింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 367 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ఆదివారం వెల్లడించా రు. మరో నలుగురు వైరస్‌ బారిన పడి మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 149594కి చేరింది. ఇందులో 146750 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 1842 మంది ఆస్పత్రులు, హోమ్‌ ఐసోలేషన్‌లో వైద్యసేవలు పొందు తున్నట్లు అధికారులు వెల్లడించారు.

నేడు కోవాగ్జిన్‌ తొలి డోసు

అనంతపురం వైద్యం, జూన్‌ 13: జిల్లావ్యాప్తంగా సోమవారం కోవాగ్జిన్‌ తొలి డోసు వేయనున్నారు. గతంలో ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్లలో మాత్రమే కోవాగ్జిన్‌ టీకా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కోవాగ్జిన్‌ జిల్లా వ్యాప్తంగా పంపిణీకి తొలిసారిగా అది కూడా తొలి డోసు వారికి వేస్తున్నారు. జిల్లాకు 25వేల కోవాగ్జిన్‌ డోసులు వచ్చాయి. సోమవారం జిల్లాలోని 120 కేం ద్రాల్లో టీకా పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వ రప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారికి, ఐదే ళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు, విదేశాలకు వెళ్లేవారికి ఈ టీకా వేయనున్నట్లు వారు తెలిపారు.