పేదలకు ఉన్నత విద్య అందించాలన్నదే సీఎం ఆశయం

ABN , First Publish Date - 2021-07-30T06:23:15+05:30 IST

పేద పిల్లల కు ఉన్నత విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయమని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు.

పేదలకు ఉన్నత విద్య అందించాలన్నదే సీఎం ఆశయం
మెగాచెక్కును అందజేస్తున్న మంత్రి, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

వుుంత్రి శంకరనారాయణ

 జగనన్న విద్యాదీవెన ద్వారా 83,095 మందికి లబ్ధి: కలెక్టర్‌

అనంతపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): పేద పిల్లల కు ఉన్నత విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయమని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు.  గురువారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ ఏడాదికి సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ నాగలక్ష్మి, మేయర్‌ వశీం, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, ఎమ్మెల్యేలు ఉషశ్రీచరణ్‌, తిప్పేస్వామి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలో అణగారిన వర్గాల నిరుపేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి సమాజంలో అత్యున్నత స్థానానికి చేరు కునేందుకు వీలుగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప థకానికి తూట్లు పొడిచి పేద విద్యార్థులకు ఉన్నత చదు వులు అందకుండా చేసిందని విమర్శించారు.  నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి పేద పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందుల్లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 83,095 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 53.92 కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చారన్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 13,132 మంది, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో  3980, బీసీ సంక్షేమశాఖ పరిధిలో 42,574, కాపు సంక్షేమశాఖ కింద 4,446 మంది, ఈబీసీ కింద 11,357 మంది, ముస్లిం,మైనార్టీ పరిధిలో 7,488 మంది, క్రిస్టియన్‌ మైనార్టీ కింద 118 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు జగనన్న విద్యాదీవెన లబ్ధిని జమచేశారన్నారు.  అనంత రం విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం కింద మం జూరైన రూ. 53.92 కోట్ల మెగా చెక్కును మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్‌ హరిత రాజగోపాల్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్‌ లిఖిత, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, జేసీ గంగాధర్‌ గౌడ్‌, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ డీడీలు యుగంధర్‌, విశ్వమోహన్‌ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ డీటీడబ్ల్యూఓ అన్నాదొర, నగర కమి షనర్‌ మూర్తి, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ రసూల్‌, నగర డిప్యూటీ మేయర్‌ వాసంతీసాహిత్య, మాజీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, విద్యార్థులు, వారి తల్లులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:23:15+05:30 IST