ప్రభుత్వ ధరలకే కొవిడ్‌ చికిత్స చేయాలి

ABN , First Publish Date - 2021-04-19T06:25:54+05:30 IST

ప్రైవేట్‌ ఆ స్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్‌-19 వై ద్యసేవలందించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.

ప్రభుత్వ ధరలకే కొవిడ్‌ చికిత్స చేయాలి

 అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవు..  ప్రైవేట్‌ ఆస్పత్రుల 

యాజమాన్యాలకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరిక

అనంతపురం, ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి) : ప్రైవేట్‌ ఆ స్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్‌-19 వై ద్యసేవలందించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే సంబంధిత ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలుఒ తప్పవని ఆ దివారం ఓ ప్రకటనలో  హెచ్చరించారు.  ప్రైవే ట్‌ ఆస్ప త్రుల్లో అత్యవసరంకానీ కొవిడ్‌-19 చి కిత్సలకు రోజుకు రూ. 3250లు తీసుకోవాలన్నారు. అత్యవసరమైన(క్రిటికల్‌) కొవిడ్‌- 19 చికిత్సకు సంబంధించి ఐసీయూలో(వెంటిలేటర్‌, ఎన్‌ఐవీ లేకుండా) వైద్యమందించేందుకు రూ. 5480  తీ సుకోవాలన్నారు. నోటిలో పైపులేకుండా వెంటిలేటర్‌ ద్వా రా ఆక్సిజన్‌ అందించే వ్యవస్థతో ఐసీయూ చికిత్సకు రూ. 5980 తీసుకోవాలన్నారు. రక్తంలో ఇ న్ఫెక్షన్‌ ఉన్న స్థితిలో వెంటిలేటర్‌ లేకుండా చికిత్స కోసం రూ. 6280, రక్తంలో ఇన్ఫెక్షన్‌ ఉన్న స్థితిలో వెంటిలేటర్‌తో చికిత్సకు రూ. 10380 మాత్రమే తీసుకోవాలన్నారు. రక్తంలో ఇన్ఫెక్షన్‌ ఉండి బీపీ, పల్స్‌ పడిపోయే పరిస్థితితో పాటు ముఖ్య శరీర భాగాలు పనిచేయని పక్షంలో వైద్యమందించాల్సి వస్తే రూ. 10380 వసూ లు చేయాలన్నారు. యాంటీ వైరల్‌ ఔ షధం ఒక్క డోసుకు రూ. 2500 తీసుకోవాలన్నారు. అంతకుమించి డబ్బులు వసూలుచేసే ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామ ని కలెక్టర్‌ హెచ్చరిం చారు.


Updated Date - 2021-04-19T06:25:54+05:30 IST