కరువు నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2021-07-31T06:41:59+05:30 IST

జిల్లాలో ముందస్తు కరువు నివారణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సం బంధిత అధికారులను ఆదేశించారు.

కరువు నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం,జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముందస్తు కరువు నివారణ ప్రణాళికలు సిద్ధం చేయాలని  కలెక్టర్‌ నాగలక్ష్మి సం బంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో జి ల్లాస్థాయి కరువు నివారణ ప్రణాళిక కమిటీ సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరువు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా శా ఖల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయన్నారు. జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 128.4 మి.మీ కాగా ఈ ఏడాది 226.2 మి.మీ వర్షపాతం నమోదైంద న్నారు. అంటే 76.16 శాతం అధికంగా వర్షం కురిసింద న్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6.71 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకూ 3.18 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేశారన్నారు. అంటే 47 శాతం మాత్రమే పంటల సాగయ్యాయన్నారు. గతేడాది ఇదే సమయానికి 4.69 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సా గు చేశారన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీ ర్ణం తగ్గిందన్నారు. ఇప్పటి నుంచి మరో 1.5 లక్షల హె క్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యే అవ కాశముందన్నారు. జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగియటా నికి  మరో రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో... అ న్ని శాఖల అధికారులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు నెలవారీగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, సీపీఓ ప్రేమచంద్ర, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌ రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి, డీఎ్‌సఓ రఘురామిరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వరకు మార్‌, హార్టికల్చర్‌ డీడీ పద్మలత, హార్టికల్చర్‌ ఏపీడీ సతీష్‌, ట్రాన్స్‌-కో ఎస్‌ఈ వరవరరావు, హెచ్‌ఎల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఎస్‌ఈ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:41:59+05:30 IST