మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-03-06T06:54:11+05:30 IST

నెల 10వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు
మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటిం గ్‌ శాతం పెంచేందుకు ముందుగా ఓటర్‌స్లిప్పుల పంపిణీపై ప్రత్యేకంగా దృషి సారించామన్నారు. పట్టణ ఓ టర్లకు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని, 7వ తేదీ నాటికి వంద శాతం పూర్తిచేస్తామన్నారు. ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను ఛిఛీఝ్చ.్చఞ.జౌఠి.జీుఽ లేదా ట్ఛఛి. ్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ’నో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌’ లింకు ద్వారా  తెలుసుకోవచ్చన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లోలాగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వలస కూలీలను రప్పించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలద్వారా గతంలో ఎన్నడూ లేనంత గా మున్సిపాలిటీల్లో ఓటింగ్‌శాతం పెరుగుదలను ఆశిస్తున్నామన్నారు.


రేపు పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చునన్నారు. హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తి, మడకశిర పట్టణాల్లోని మున్సిపల్‌ కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకోవచ్చునన్నారు. అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, ధర్మవరంలో బీఎస్సార్‌ పురపాలక పాఠశాల, కదిరిలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలల్లో పోస్టల్‌బ్యాలెట్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. 

Updated Date - 2021-03-06T06:54:11+05:30 IST