Abn logo
Sep 24 2021 @ 00:42AM

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం : కలెక్టర్‌

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 23: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యులకు కలెక్టర్‌ నాగల క్ష్మి సెల్వరాజన సూచించారు. గురువారం జిల్లా వైద్యశాఖ కా ర్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు, పీహెచసీల వై ద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటికీ మాతాశిశు మరణాలు సంభవిస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. వీటి ని పూర్తిగా నివారించాలన్నారు. ఆ దిశగా అంగనవాడీలు, సచివాలయ, ఆరోగ్య కేం ద్రాల వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు జాతీయ ఆరోగ్యమిషన పథకాల అమలు, పురోగతిపై కలెక్టర్‌ దీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరి, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీడీ సుజన, డీసీహెచఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌ పాల్గొన్నారు.