ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-19T06:59:43+05:30 IST

కరోనా నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు.

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి
సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

- జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

అనంతపురం,జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 2021-22 జాబ్‌ కేలండర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంఛనంగా విడుదల చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీలు డా. సిరి, గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లో కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్‌ సర్వేను ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఫీవర్‌ సర్వేను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. సర్వేలో జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలున్న వారి జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని శానిటేషన్‌ సెక్రటరీలను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ పార్వతి, ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T06:59:43+05:30 IST