Abn logo
Sep 24 2021 @ 00:56AM

సర్వర్‌ సమస్య సశేషం..!

అధికారులు హామీ ఇచ్చినా అంతే..! 

ఒక్కరోజు నిరసనతో సరిపెట్టిన డీలర్ల సంఘం నేతలు  

రాష్ట్ర కమిటీ పిలుపు కోసం ఎదురుచూపులు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 23: ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన (పీ ఎంజీకేఏవై) పథకం ద్వారా ఐదు రోజులుగా కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. తొ లిరోజు నుంచే సర్వర్‌ మొరాయించడం మొదలైంది. తెల్లవారుజామున, మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన సమయాల్లో సర్వర్‌ పూ ర్తిగా బంద్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో కార్డుదారులు ఎఫ్‌పీ షా పుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎఫ్‌పీ షాపుడీలర్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీలర్ల సంఘం పిలుపు మేరకు బుఽధవా రం ఒక్క రోజు ఎఫ్‌పీ షాపులకు తాళాలు వేసి, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ-పోస్‌ యంత్రాలను తహసీల్దార్‌ కార్యాలయాల్లో అ ప్పగించారు. సాయంత్రంలోగా సర్వర్‌ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.     గురువారం కూడా సర్వర్‌ సమస్య తలెత్తడంతో డీలర్లు అవాక్కవుతున్నారు. దీంతో కార్డుదారులు, డీలర్లకు సర్వర్‌ కష్టాలు తప్పలేదు. నిరసన తెలిపిన రోజు సాయంత్రంలోగా సర్వర్‌ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులను డీలర్లు ప్రశ్నించినా ఎనఐసీ అధికారులు దీనిపైనే పని చేస్తున్నారంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఎఫ్‌పీ షాపు డీలర్లు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే విషయా న్ని ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర కమిటీ పిలుపు ఇ స్తేనే ఏదైనా కార్యక్రమాలు చేసేందుకు వీలుంటుందని అంతవరకు ఆగాలని కొందరు సంఘం నాయకులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో డీలర్లు మిన్నకుండిపోతున్నారు. మరి సర్వర్‌ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో సంబంధిత ఉన్నతాధికారులే సెలవియ్యాల్సి ఉంది.