Abn logo
Sep 22 2021 @ 00:41AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పెద్దవడుగూరు, సెప్టెంబరు 21: అప్పుల బాధ భరిం చలేక మండలంలో ని బుర్నాకుంట గ్రా మ రైతు క్రిష్టప్ప (50)  సోమవారం అర్ధరాత్రి ఉరేసుకు ని, ఆత్మహత్య చేసుకున్నాడు. క్రిష్టప్ప తన నాలుగు ఎకరా ల్లో పత్తి, వేరుశనగ సాగు చేశాడు. పం టల పెట్టుబడుల కోసం సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడు. గతేడాది మూడు ఎకరాల పొ లాన్ని అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో తీవ్ర మన స్తాపం చెంది, ఇం ట్లోనే సోమవారం అర్ధరాత్రి ఉరేసుకు ని, మరణించాడు. భార్య అనూరాధ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. క్రిష్టప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు.