ఉచిత పంటల బీమా రిజిస్ర్టేషన్‌పై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-03-01T06:24:58+05:30 IST

వైఎస్‌ ఆర్‌ ఉచి త పంటల బీమా పథకం రిజిస్ర్టేషన్‌పై వ్యవసాయ యం త్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది.

ఉచిత పంటల బీమా రిజిస్ర్టేషన్‌పై నిర్లక్ష్యం

గత నెల 16 నుంచి ప్రారంభం 

క్షేత్ర స్థాయిలో రైతులకు

తెలియజేయడంలో అలసత్వం 

అనంతపురం వ్యవసాయం, ఫిబ్రవరి 28 :  వైఎస్‌ ఆర్‌ ఉచి త పంటల బీమా పథకం రిజిస్ర్టేషన్‌పై వ్యవసాయ యం త్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. గతంలో పంటల బీ మా వర్తింపజేసేందుకు రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసేవారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటనష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమి యం మొత్తం చెల్లించి పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టపోతే పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కర్షక్‌ యాప్‌లో పంట నమోదు చేసుకుంటేనే ప్ర భుత్వం నుంచి వచ్చే ఉచిత పంటల బీమా, పరిహారం అందించాలని నిర్ణయించారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తప్పనిసరిగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని షరతు విధించారు. 2020 ఖరీ్‌ఫలో పంటలు సాగు చేసిన రైతులతో ఈనెల 16 నుంచి ఉచిత పంటల బీమా కోసం పేర్లు రిజిస్ర్టేషన్‌ చేయించు కోవడం మొదలు పెట్టారు. ఆ విషయాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు తెలపటంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించారు. జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల పర్యవేక్ష ణాలోపమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటి దాకా లక్ష మందికే అవకాశం  

ఉచిత పంటల బీమా వర్తింపజేసేందుకు రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఆధార్‌ నెంబర్‌తో వేలిముద్ర వేసి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ కార్డులోని సభ్యుల్లో ఒకరు వేలిముద్ర వేసినా మిగతా వారి ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి అందరి పేర్లు  రిజి స్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతేడాది ఖరీ్‌ఫలో పంట సాగు చేసిన 5.60 లక్షల మందికిపైగా రైతులతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి దాకా లక్ష మందితోనే రిజిస్ర్టేషన్‌ చేయడంతో సరిపెట్టారు. ఇప్పటికైనా వ్యవసాయ ఉన్నతాధికారులు రిజిస్ర్టేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. లేదంటే అర్హులైన రైతు లకు అన్యాయం జరిగే పరిస్థితులున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

Updated Date - 2021-03-01T06:24:58+05:30 IST