జేసీ వర్సస్‌ పీహెచ్‌సీ వైద్యులు

ABN , First Publish Date - 2021-06-19T06:55:49+05:30 IST

ఫీవర్‌ సర్వే వివా దం రేపింది. కరోనా నియంత్రణ నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి వారికి తగిన పరీక్షలు ని ర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిం చాలని ప్ర భుత్వం ఆదేశించింది.

జేసీ వర్సస్‌ పీహెచ్‌సీ వైద్యులు
కలెక్టర్‌ను కలిసి వస్తున్న పీహెచ్‌సీ వైద్యులు

వివాదం రేపిన ఫీవర్‌ సర్వే

అగౌరవంగా మాట్లాడుతున్నారంటూ తిరుగుబాటు

కలెక్టర్‌ను కలిసి సిరిపై ఫిర్యాదు

అనంతపురం వైద్యం, జూన్‌ 18: ఫీవర్‌ సర్వే  వివా దం రేపింది. కరోనా నియంత్రణ నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి వారికి తగిన పరీక్షలు ని ర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిం చాలని ప్ర భుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ సైతం ఫీవర్‌ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించారు. జేసీలు, వైధ్యాధికారు లతో కలిసి మండల స్థాయి వైద్యాధికారులు, తహసీల్దార్ల తో ఆమె కాన్ఫరెన్స్‌ నిర్వహించి సీరియ్‌సగా ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా ఫీవర్‌ సర్వే పక్కాగా పూర్తి చేయా లని సూచించారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ డా క్టర్‌ సిరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌తో కలిసి జూమ్‌ యాప్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ సర్వేపై ఆరా తీసి పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో జేసీ సిరి ఒకింత గట్టిగా హెచ్చరికలు కూడా చేసినట్లు వైద్య వర్గాలు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా సర్వే బుధవారంలోపే పూర్తి చేయాలని లేకపోతే క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తుందని ఆమె అగౌరవంగా మాట్లాడి మానసికవేదనకు గురిచేసినట్లు పీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు. జేసీ సిరి వ్యాఖ్యలపై పీహెచ్‌సీ వైద్యులు తిరుగుబాటుకు దిగారు. రాత్రిపూట కూడా జూమ్‌ యాప్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని దీంతో మహిళా డాక్టర్లు ఇళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారని పీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు. ఆమె వైఖరిని నిరసిస్తూ  శుక్రవారం ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో పలువురు పీహెచ్‌సీ వైద్యులు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యులు జేసీ సిరి వ్యాఖ్యలను కలెక్టర్‌కు వివరించారు. క్రిమినల్‌ కేసులు ఫైల్‌ చేస్తామని జేసీ బెదిరిస్తూ తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. అసభ్య పదజాలం వాడకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ తీరుపైనా పీహెచ్‌సీ వైద్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో మానసిక ఒత్తిడికి గురై నిరంతరం శ్రమిస్తున్నా డీఎంహెచ్‌ఓ నుంచి ఎలాంటి సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఫీవర్‌ సర్వే జేసీ వర్సస్‌ పీహెచ్‌సీ వైద్యుల మధ్య వివాదం రేపింది. గతంలో కూడా జేసీ సిరి దురుసుగా మాట్లాడారని మాజీ డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌ మధ్య వివాదం తలెత్తగా వైద్య ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఇప్పుడు మళ్లీ జేసీ సిరి అసభ్యంగా మాట్లాడారంటూ పీహెచ్‌సీ వైద్యులు తిరుగుబాటు చేయ డం వైద్య శాఖలో చర్చకు దారితీసింది.  

Updated Date - 2021-06-19T06:55:49+05:30 IST