Abn logo
Sep 24 2021 @ 00:41AM

కదిరిలో నకిలీ చలానాల కలకలం

44 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.21 లక్షలు స్వాహా.. 

చలానాలు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్లు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 23: కదిరి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో నకిలీ చ లానాలు కలకలం రేపాయి. దీంతో జిల్లాలోని అనంతపురం, హిందూపురం రిజిసా్ట్రర్ల పరిధిలోని 21 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో కొన్ని రోజులుగా తనిఖీలు చేయడంతోపాటు రికార్డులను పరిశీలించారు. దీంతో కదిరి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో 44 డాక్యుమెంట్లకు సంబంధించి నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు బుధవారం వెలుగు చూసింది. రూ. 21 లక్షల వరకు స్వాహా చేసినట్లు తేలిందని ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. దీంతో సమగ్ర నివేదిక అందజేయాలని గురువారం ఆ శాఖ డీఐజీ మాధవి.. హిందూపు రం జి ల్లా రిజిసా్ట్రర్‌ ఉమాదేవిని అదేశించారు. నివేదిక రాగానే.. నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. 2018-19 మధ్యలో ఈ వ్యవహారం సాగిందని తెలిసింది.  సమగ్ర నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు డీఐజీ మాధవి తెలియజేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపగా.. జిల్లాలోని కదిరి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో కూడా ఆలస్యంగా వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది.