Abn logo
Sep 23 2021 @ 00:53AM

భూ రీసర్వే భవిష్యత తరాలకు దిక్సూచి

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సిద్ధార్థ్‌ జైన

రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన

అనంతపురం,సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన భూ రీసర్వే భవిష్యత తరాలకు దిక్సూచిగా పనిచేస్తుందని రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భూ రీ సర్వేను యజ్ఞంలా భావిం చి పనిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.  బుధవారం అనంతపురం వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో రాయలసీమ జిల్లాల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి రీ సర్వేలో తలెత్తే ఇబ్బందులు, అందుకు పరిష్కారాలు, రీ సర్వే పకడ్బందీగా నిర్వహించడంపై ఆయన సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ ములు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండి యా సంయుక్త భాగస్వామ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఆస్తి ప్రభుత్వ  హామీతో కూడిన శాశ్వత హక్కు పత్రం జారీ కోసం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే 900 గ్రామాల్లో వివిధ సర్వే బృందాలతో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా భూ సర్వే చేపడుతున్నామని తె లిపారు. సర్వే ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అవినీతికి తావు లేకుండా భూ విధానాలకు వెసులుబాటు, ప్రతి భాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ఏ ర్పాటు చేస్తామన్నారు. పైలెట్‌ గ్రామాల్లో సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నిశాంతకు మార్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, నాలుగు జిల్లాల డివిజన్ల ఆర్డీఓలు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డిప్యూ టీ ఇనస్పెక్టర్లు, సర్వేయర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  కాగా, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైనను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో జేసీ నిశాంత కుమార్‌తో కలిసి ఆమె కమిషనర్‌ను కలిశారు. జిల్లాలో భూ రీ సర్వే జరుగుతున్న తీరుపై చర్చించారు.