కన్నుల పండువగా దేవాలయాల ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-06-20T06:30:20+05:30 IST

మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 ఏళ్ల చరిత్ర కల్గిన నీలకంఠేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధారణ కార్యక్రమం, నూతన దేవాలయాల ప్రారంభోత్సవం శనివారం కన్నుల పండువగా ప్రా రంభమైంది.

కన్నుల పండువగా దేవాలయాల ప్రారంభోత్సవం
పూజా కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి దంపతులు

పాల్గొన్న రఘువీరారెడ్డి దంపతులు, స్థానిక ఎమ్మెల్యే

మడకశిర, జూన్‌ 19: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 ఏళ్ల చరిత్ర కల్గిన నీలకంఠేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధారణ కార్యక్రమం, నూతన దేవాలయాల ప్రారంభోత్సవం శనివారం కన్నుల పండువగా ప్రా రంభమైంది. ఈకార్యక్రమాలు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేలా ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు చేశారు. ధాన్యవాసంలో ఉంచిన విగ్రహాలకు రఘువీరారెడ్డి దంపతులు, గ్రామస్థులు పూజలు నిర్వహించి ప్రతిష్ఠాపనకు తీశారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు మునీశ్వరాలయం, ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవిశ్వక్షేన మహా గణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాబంధనము. ఆచార్య రుత్వికవర్ణము, వాస్తుహో మం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, జలధివాసము, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, పంచగవ్య స్థాపనము, ధాన్యాదివాసము, శయ్యాదివాస ము, రాత్రి 8 గంటల నుంచి జీవాదిత్వ హోమం, పుష్పాది వాసము, రాత్రి 9.30 గంటలకు మహా మంగళ హారతి, రాత్రి 10 గంటలకు మునీశ్వరస్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి అష్టబంధన సహిత ఆధార పీఠ పూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రఘువీరారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు.


నేటి   కార్యక్రమాలు

నీలకంఠాపురం దేవస్థానాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం  ఉద యం 6.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మునీశ్వర, ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీవిశ్వక్షేన మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, ద్వారారాధన, కుంభోప కుంభారాధన, శ్రీపంచముఖ ఆంజనేయస్వామి మూలమంత్ర హోమము, శ్రీసప్త మునీశ్వర హోమము, ప్రాణ ప్రతిష్ఠాంగహోమము, మహా పూర్ణాహుతి ప్రారంభమవుతాయి. ఉదయం 10.51 గంట ల నుంచి 11.01 గంటలలోపల శుభ సింహలగ్నములో మునేశ్వరస్వామి ఆలయములో గోపుర కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ, ఉదయం 11.15 గంటల నుంచి 12 గంటలలోపు పంచముఖ ఆంజనేయస్వామికి కుంభాభిషేకం, ప్రసన్న ఆంజనేయస్వామి ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మిలనము, పంచామృతాభిషేకం, అలంకారం, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ప్రాచీన దేవాలయాల జీర్ణోద్ధరణ హర్షణీయం: చిరంజీవి

నీలకంఠాపురంలో పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, నూతన దేవాలయాల నిర్మాణం హర్షించదగ్గ విషయమని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పేర్కొంటూ సందేశాన్ని పంపారు. గ్రామంలో మాజీ మంత్రి ర ఘువీరారెడ్డి సారథ్యంలో నిర్మించిన దేవాలయాల ప్రారంభోత్సవం సంద ర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపారు. తన రాజకీయ ప్రస్తానంలో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి అనీ, కొద్ది సమయంలోనే తనకెంతో ఆప్తుడయ్యారన్నారు. ఆయన చాలా అరుదైన వ్యక్తి అన్నారు. రఘువీరాకు ఎల్లప్పుడూ ప్రజల సహకారంతోపాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T06:30:20+05:30 IST