సామాన్యులకేనా మాస్క్‌..?

ABN , First Publish Date - 2021-07-31T06:40:32+05:30 IST

కరోనా కేసులు తగ్గినా.. తప్పనిసరిగా ప్రజలు మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు మాస్కులు వేసుకోకుండా తిరుగుతున్న వారికి జరిమానా కూడా వేస్తున్నారు.

సామాన్యులకేనా మాస్క్‌..?
మాస్కుల్లేకుండా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్‌,కార్పొరేటర్లు, సీఐ తదితరులు

కరోనా కేసులు తగ్గినా.. తప్పనిసరిగా ప్రజలు మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఈ మేరకు పోలీసులు మాస్కులు వేసుకోకుండా తిరుగుతున్న వారికి జరిమానా కూడా వేస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన 5012 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు సామాన్యుల పట్ల ఒకలాగా..  ప్రజాప్రతినిధుల పట్ల మరోలాగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. శుక్రవారం అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే, పలువురు కార్పొరేటర్లు మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. మాస్కు ధరించని ఓ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాక్షిగా ఈ నిబంధనల ఉల్లంఘన జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. 



Updated Date - 2021-07-31T06:40:32+05:30 IST