తిరుమలలో డిక్లరేషన్‌ పద్ధతి కొనసాగించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2020-09-25T09:41:47+05:30 IST

తిరుమలలో స్వామివారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌ పద్ధతిని కొనసాగించాలని టీడీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

తిరుమలలో డిక్లరేషన్‌ పద్ధతి కొనసాగించాలి: టీడీపీ

గోరంట్ల, సెప్టెంబరు 24: తిరుమలలో స్వామివారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌ పద్ధతిని కొనసాగించాలని టీడీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ అన్యమతస్తులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్‌ అవసరం లేదని చెప్పటం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని ఆరోపించారు.


గోరంట్లలోని వినాయక ఆలయం వద్ద ఈ విషయమై ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలను కాపాడటానికి డిక్లరేషన్‌ పద్ధతి కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఉత్తరాలను పోస్ట్‌ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.


కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్‌ సోమశేఖర్‌, నరసింహులు, ఉత్తమ్‌రెడ్డి, భా స్కర్‌రెడ్డి, అజ్మతుల్లా, బెల్లాలచెరువు చంద్ర, గిరిధర్‌గౌడ్‌, నూర్‌మహ్మద్‌, నీలకంఠారెడ్డి, శీన, జయరాం, ప్రభాకర్‌, నర్సారాం, ఎస్వీ నారాయణ, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T09:41:47+05:30 IST