రిజిస్ట్రేషన్ల జాతర.. కొవిడ్‌ నిబం ధనలకు పాతర

ABN , First Publish Date - 2020-09-25T09:38:36+05:30 IST

స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు కన్పించకపోగా భారీ సందడి నెలకొంది. ఇటీవల ప్రతి రోజు రిజిస్ర్టేషన్ల కోసం ఎగబా

రిజిస్ట్రేషన్ల జాతర.. కొవిడ్‌ నిబం ధనలకు పాతర

ఫొటో రిజిస్ట్రేషన్లకు ఎగబడిన జనం..

కరోనా నిబంధనలు పట్టని వైనం..


హిందూపురం,సెప్టెంబరు 24: స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు కన్పించకపోగా భారీ సందడి నెలకొంది. ఇటీవల ప్రతి రోజు రిజిస్ర్టేషన్ల కోసం ఎగబాటుతో ఆందోళనకు దారితీస్తోంది. గురువారం ఫోటో రిజిస్ర్టేషన్‌ వద్ద ఎగబాటుతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం హిందూపురం పార్లమెంట్‌ స్థానాన్ని కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనతో పట్టణంతోపాటు చుట్టూ భూములు, ప్లాట్లు భారీగా విలువలు పెరిగాయి.


అదే స్థాయిలో రిజిస్ర్టేషన్లతోపాటు అగ్రిమెంట్లు కూడా  పెరిగిపోయాయి. ఈనేపథ్యంలో కొద్దిరోజులుగా హిందూపురం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద ప్రతి రోజు జన సందడి పెరిగింది. కొవిడ్‌ నిబంధనలతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఫొటో రిజిస్ర్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఓకే ఫోటో రిజిస్ర్టేషన్‌తో ఏమాత్రం క్యూలైన్‌ పాటించకుండా జనం ఎగబాటుతో ఘర్షణకు దారితీస్తోంది. ఇటీవల ఆన్‌లైన్‌ సర్వర్‌ సక్రమంగా పనిచేయపోగా రిజిస్ర్టేషన్లు ముందుకు సాగడంలేదు.


ప్రతి రోజు డాక్యుమెంట్లు పెరుగుదలతో దస్తావేజు లేఖర్లు పోటీ పడి తమ డాక్యుమెంట్లు పూర్తి కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కార్యాలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య అధికమైంది. కార్యాలయంలోకి కేవలం రిజిస్ర్టేషన్లు ఉన్న వారికి మాత్రమే అనుమతి నిబంధనలు పెట్టిన అధికారులనే బెదిరించే స్థాయికి చేరింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టకపోవండతో కార్యాలయం వద్ద రియల్‌ మధ్యవర్తులదే పైచేయిగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-09-25T09:38:36+05:30 IST