వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతులు బిజీబిజీ

ABN , First Publish Date - 2020-09-25T09:58:51+05:30 IST

ఖరీ్‌పలో సాగుచేసిన వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతన్నలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ధర్మవరం మండలంలో ఖరీప్‌ సీజన్‌లో దాదాపుగా 14వేల హెక్టార్లులలో వేరుశనగను సాగుచేశారు.

వేరుశనగ  పంట తొలగింపు పనుల్లో రైతులు బిజీబిజీ

 ఖరీ్‌పలో సాగుచేసిన వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతన్నలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ధర్మవరం మండలంలో ఖరీప్‌ సీజన్‌లో దాదాపుగా 14వేల హెక్టార్లులలో వేరుశనగను సాగుచేశారు. ప్రస్తుతం వేరుశనగ పంట కాలం పూర్తికావడంతో తొలగింపు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వసంతపురం, చిగిచెర్ల, చింతలపల్లి, గరుడంపల్లి, తుమ్మల, గొట్లూరు గ్రామాల్లో పంటను తొలగింపు పనులు చేపడుతున్నారు.


పంట దిగుబడి ఆశాజనకంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కొక్క కూలీకి రూ.300నుంచి 400వెచ్చించి పంటను తొలగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎడతెరపలేని వర్షాలతో పంట దిగుబడి తగ్గి నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు.

Updated Date - 2020-09-25T09:58:51+05:30 IST