తప్పుల తడకగా ఓటరు జాబితా

ABN , First Publish Date - 2021-03-08T06:52:07+05:30 IST

ఎన్నికల్లో పో టీచేసే అభ్యర్థులకు మున్సిపల్‌ ఎన్నికలు పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టాయి.

తప్పుల తడకగా ఓటరు జాబితా
మృతి చెందిన ఓటర్లను జాబితాలో అలాగే ఉంచిన దృశ్యం

మృతుల ఓట్లను తొలగించని వైనం

వందల సంఖ్యలో ఫొటోలు గల్లంతు

గుర్తుపట్టలేని విధంగా ఓటర్ల ముఖాలు

ఏడాది సమయమున్నా మార్చని వైనం

తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు

పోలింగ్‌ ఏజెంట్లే కీలకం

అనంతపురం కార్పొరేషన్‌,మార్చి 7: ఎన్నికల్లో పో టీచేసే అభ్యర్థులకు మున్సిపల్‌ ఎన్నికలు పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టాయి. ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సంపాదిం చాలనే యోచనలో ఉన్న వారికి ఇప్పుడు ఓటర్ల జాబితా కొంత అయోమయాన్ని...మరికొంత గందరగోళాన్ని కలిగి స్తోంది. ఎక్కువమంది కొత్త అభ్యర్థులు కావడం, డివిజ న్లు పునర్విభజన చేయడం, కొత్త ఓటర్లు ఇవన్నీ ప్రస్తుతం నగరపాలక సంస్థలో చర్చనీయాంశాలుగా మారాయి. పాత ఓటర్లను విడిచిపెట్టి కొత్త ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దీర్ఘాలోచనలో ఉన్న అభ్యర్థులకు ఓటరు జాబితా మాత్రం కంగారు పుట్టిస్తోంది. ఎప్పుడో మృతి చెందిన వారి ఫొటోలు కూడా ఉండటం... కొందరు ఓటర్ల కు ఫొటోలు లేకపోవడం మరింత కంగారు పుట్టిస్తోంది.  అప్పట్లో కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో అభ్యర్థులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఓటరు జాబితా చూసిన తరువాత ఆ తప్పొప్పులను సరిదిద్దుకు నేందుకు రాజకీయపార్టీల నాయకులందరూ రెవెన్యూ కా ర్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ రద్దయ్యింది. అప్పుడున్న తప్పులే ఇప్పుడూ కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది సమ యమున్నా వాటిపై దృష్టి సారించిన పాపాన పోలేదు. నగరపాలక సంస్థ పరిధిలో 50డివిజన్లకు గాను మొత్తం 228924మంది ఓటర్లుండగా... 114237 మంది పురుష ఓ టర్లు, 114645మంది మహిళా ఓటర్లు, ఇతరులు (హిజ్రా )లు 42మంది ఉన్నారు. 


మృతుల ఓట్లను తొలగించని వైనం...

నగరంలో కొన్నివేల ఓట్లు తప్పులుగా కనపడుతున్నా యి. ఎన్నో ఏళ్ల కిందట మృతి చెందిన వారి ఫొటోలను కూడా తొలగించలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మృతుల ఓట్లు అలాగే ఉంచడం వలన డివిజన్‌లో ఓట్ల సంఖ్య అలాగే కనిపిస్తోందని...కానీ పోలింగ్‌ సమయంలో మాత్రం కనిపించడం లేదంటున్నా రు.  అలాంటి ఓట్లు జాబితాలోనే ఉండటం వలన దొంగ ఓట్లకు ఆస్కారముందనే అభిప్రాయాన్ని రాజకీయపార్టీలే వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది మార్చి తరువాత నగరంలో చాలామంది కరోనాతో మృతి చెందారు. మరికొందరు వివిధ కారణాలతో మృతి చెందారు. అంతకుముందున్న ఓటరు జాబితాలోనే మృతిచెందిన వారిని తొలగించలేదు. ఇక గతేడాది మృతి చెందిన వారిని అలాగే ఉంచారు. నగరంలోని ప్రతి డివిజన్‌లోనూ ఓటరు జాబితాలో మృతి చెందిన ఓట్లను తొలగించలేదనేది సుస్పష్టం.  ఏది ఏమై నా ఆయా పోలింగ్‌ బూత్‌లలో పార్టీ ఏజెంట్లే కీలకమయ్యే అవకాశముంది. వారు గుర్తుపట్టకపోతే అంతే సంగతులు. 


ఓటరు ఫొటో ఎక్కడ...?

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్న మరో సమస్య ఓటరు ఫొటోలు. సాధా రణం గా అధికారులు వెలువరించే ఓటరు జాబితాలో ఓట రు చిరునామాతో పాటు ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ సారి వందల ఫొటోలు కనిపించడం లేదు. అవి ఏమయ్యాయో అధికారులకే తెలియాలి. నగరంలో దాదా పు 80శాతం డివిజన్లలో ఈ సమస్య తలెత్తింది. ఒక్కో డివిజన్‌లో పదుల సంఖ్యలో ఓటర్ల ఫొటో లేకపోవడంపై అభ్యర్థులు అవాక్కవుతున్నారు. ఈ విషయంపై కార్పొరేష న్‌లో సరైన సమాధానం రాకపోవడంతో రెవెన్యూ కార్యాల యానికి వెళ్లారు. అక్కడా స్పందించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరి పోలింగ్‌ సమయంలో అధికారులు, ఏజెంట్లు ఫొటో లేని ఓటరును ఎలా గుర్తుపడతారు...?అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది. మరి కొన్ని ఫొటోలున్నా స్పష్టం గా కనిపించడం లేదు. మరి ఈ తప్పు ఎలా జరిగిందో...? వాటిని ఎందుకు పునఃపరిశీలన చేయలేదో...? అధికా రులకే తెలియాలి. 


నివాసం పంచాయతీలో....నగరంలో ఓటు...

ఎక్కడో దూరంగా ఉన్న రూరల్‌ పంచాయతీల్లో నివాస మున్నా ఓటు మాత్రం నగరపాలక సంస్థ పరిధిలో ఉంది.  నివాసాలు ఒకచోట. ఓటు మరోచోట అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి వ్యవహారా లు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కుటుంబాలు అనంతపురం రూరల్‌ మండల పరిధి లోని నారాయణపురం పంచాయతీలో గత పదేళ్లుగా నివాసముంటున్నాయి. కానీ వారి ఓట్లు నగరంలోని 43, 44వ డివిజన్లలో ఉన్నాయనే ఆరోపణలున్నాయి. నాయక్‌ నగర్‌, రాణినగర్‌, ఆసార్‌వీధి తదితర ప్రాంతాల్లో నివాస ముంటున్న ఓట్లు 21వ డివిజన్‌ పరిధిలోని మున్నా నగర్‌లో ఉన్నాయి. రాప్తాడు, బుక్కరాయసముద్రంలలో నివాసముంట్ను వారి ఓట్లు కూడా నగరంలోని పలు డివి జన్లలో ఓట్లుగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే డివిజన్ల విభజనతో పాత ఓట్లు పోగొ ట్టుకొని  కొత్త  ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థు లు, నాయకులు ఎక్కడో ఉన్న ఓటర్లను ఎలా పట్టుకుం టారో మరి.



Updated Date - 2021-03-08T06:52:07+05:30 IST