ఒకటో తేదీనే అందని పింఛన్‌

ABN , First Publish Date - 2021-08-02T06:20:51+05:30 IST

: జిల్లాలో పింఛన్ల సొమ్ము పంపిణీకి ఆటంకం ఏర్పడింది.

ఒకటో తేదీనే అందని పింఛన్‌

సచివాలయాలకు డబ్బు జమలో జాప్యం 

తొలిరోజు 65 శాతమే పంపిణీ 

పట్టణ ప్రాంతాల్లో అరకొరే

పింఛన్‌దారులకు నిరాశ

అనంతపురం వ్యవసాయం, ఆగస్టు 1: జిల్లాలో పింఛన్ల సొమ్ము పంపిణీకి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు నెలకు సంబంధించి జిల్లాకు 5.18 లక్షల మందికి రూ.126.69 కోట్లు మంజూ రు చేశారు. ప్రతి నెలారంభానికి ముందురోజే మొత్తం డబ్బు ఆయా సచివాలయాలకు ప్రభు త్వం జమ చేస్తోంది. ఆ డబ్బును సచివాలయ అధికారులు డ్రా చేసుకుని, వలంటీర్ల ద్వారా ఇం టి వద్దనే పింఛన్ల పంపిణీ చేయిస్తూ వస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి శనివారం రాత్రి దాకా వందలాది సచివాలయాలకు పింఛన్‌ డబ్బు జమ చేయలేదు. అనంతపురం నగరంతోపాటు ఇతర మున్సిపాలిటీలు, మరికొన్ని రూరల్‌ ప్రాంతాల్లోని సచివాలయాలకు డబ్బు జమ చేయలేదు. ఆదివారం సాయంత్రానికి జి ల్లాకు ఇంకా రూ.20 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రంలోగా డబ్బు జమ చేసిన సచివాలయాల పరిధిలోనే ఆదివారం తొలిరోజు పింఛన్‌ సొమ్మును పంపిణీ చేశారు. మిగతాచోట్ల ఇవ్వలేదు. ఆదివారం సెలవు రోజు కావడంతో కొన్ని సచివాలయాలకు ఆలస్యంగా డబ్బు జమైనా.. డ్రా చేసుకోలేకపోయారు.


పింఛన్‌దారులకు నిరాశ 

ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొం ది. సచివాలయాలకు డబ్బు జమ చేయడంలో జాప్యంతో ఈసారి పింఛన్‌ సొమ్ము పంపిణీ సవ్యంగా సాగలేదు. ఆదివారం తొలి రోజు పింఛన్‌ ఇచ్చేందుకు వలంటీర్లు రాకపోవడంతో పింఛన్‌దారులు నిరాశకు లోనయ్యారు. కనీసం డబ్బు ఎప్పుడిస్తారో కూడా కొన్ని ప్రాంతాల్లో సమాచారం ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు అయోమయానికి లోనయ్యారు. తొలిరోజు 65 శాతం మాత్రమే పింఛన్‌ సొమ్మును పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఆన్‌లైన్‌లో  వైఎ్‌సఆర్‌ పింఛన్‌ కానుక పోర్టల్‌లో పింఛన్‌ సొమ్ము పం పిణీకి సంబంధించిన వివరాలు చూపించకపోవడం గమనార్హం. కనీసం సోమవారమైనా పూర్తిస్థాయిలో డబ్బు జమ చేస్తేనే పింఛన్‌ సొమ్ము పంపిణీ ముందుకు సాగుతుంది. లేదంటే లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం

- నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ 

ప్రతి నెలా మూడు రోజులపాటు పింఛన్ల పంపిణీకీ అవకాశం ఇచ్చారు. సచివాలయాలకు డబ్బు జమలో జాప్యంతో తొలిరోజు ఇ బ్బందులు ఏర్పడ్డాయి. సోమ, మంగళవారాల్లో పింఛన్‌ సొమ్ము పంపిణీ చేస్తాం. నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయిలో అందరికీ సొమ్ము పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-08-02T06:20:51+05:30 IST