విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రేవా కృషి

ABN , First Publish Date - 2021-08-01T06:53:03+05:30 IST

విద్యను అందిం చడమే కాకుండా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రేవా యూనివర్సిటీ కృషి చేస్తుందని వర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ డాక్టర్‌ ధనుంజయ పేర్కొన్నారు.

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రేవా కృషి
రేవా ఓపెన్‌ హౌస్‌ యూజీపీజీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభిస్తున్న యూనివర్శిటీ వీసీ,

యూనివర్సిటీ వీసీ ధనుంజయ 

అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు 

 15000 మంది విద్యార్థులు, 1500 మంది సిబ్బంది

అనంతపురం విద్య, జూలై 31: విద్యను అందిం చడమే కాకుండా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రేవా యూనివర్సిటీ కృషి చేస్తుందని వర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ డాక్టర్‌ ధనుంజయ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ హోటల్‌లో శనివారం యూజీ, పీజీ కోర్సులపై రేవా యూనివర్సిటీ ఓపెన్‌ హౌస్‌ ప్రోగ్రాం నిర్వహించింది. తొలుత వర్సిటీ వీసీ, డైరెక్టర్లు రామలింగారెడ్డి, నారాయణ స్వామి.. విద్యార్థులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. తర్వాత విద్యార్థులను ఉద్దేశించి వీసీ ధనుంజయ మాట్లాడారు. బెంగళూరులోని రేవా యూనివర్సిటీతో తాము 15 ఏళ్లుగా పయణిస్తున్నామన్నారు. చిన్న సంస్థగా ప్రా రంభమై... నేడు అంతర్జాతీయ వసతులతో యూనివర్సిటీ నడుస్తోందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతోందన్నారు. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కోలార్‌, చిక్‌బళ్లాపుర్‌ తదితర జిల్లాల నుంచి 30 శాతం నుంచి 40 శాతం మంది విద్యార్థులు వచ్చి, అక్కడ చదువుకుంటున్నారన్నారు. పి. శ్యామరాజ్‌ వ్యవస్థాపకుడిగా, చాన్సెలర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. 2013లో యూనివర్సిటీ ప్రారంభమైందన్నారు. 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారనీ, 1500 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్‌, సైన్స్‌, కామర్స్‌, జర్నలిజం, కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్కిటెక్చర్‌ తదితర కోర్సులను వర్సిటీ అందిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి ఫ్యాకల్టీ ఉన్నారనీ, 300 మంది వరకూ పీహెచ్‌డీ డిగ్రీ చేసిన ఫ్యాకల్టీ, ఉత్తమ లైబ్రరీ, 3500 మందికి వసతి అందించేస్థాయి హాస్టళ్లున్నాయని పేర్కొన్నారు. అత్యుత్తమ ప్లే గ్రౌండ్స్‌, వర్సిటీ మొత్తం వైఫై, విమానాశ్రయానికి దగ్గరగా క్యాంపస్‌ అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థులకు మెరుగైన ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్‌ అందిస్తోందని తెలి పారు. విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన తమ విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారన్నారు. డైరెక్టర్‌ నారాయణస్వామి మాట్లాడుతూ ఒకప్పుడు డిగ్రీ చదివితే చాలు అనేవారనీ, ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలన్నారు. లివిల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆర్కిటెక్చర్‌, ఇతర అనేక ప్రోగ్రామ్స్‌ వర్సిటీ అందిస్తోందన్నారు. నేటి డిజిటల్‌ ప్లాట్‌ ఫాంకు, నూతన జాతీయ విద్యావిధానానికి రేవా వర్సిటీ ఒక చక్కటి వేదికని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ రామలింగారెడ్డి, ఇతర ఫ్యాకల్టీతోపాటు  పలు జిల్లాల నుంచి వచ్చిన కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-01T06:53:03+05:30 IST