ధరల పెంపుపై తెలుగు మహిళల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-07-23T07:00:06+05:30 IST

రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచడంపై తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరల పెంపుపై తెలుగు మహిళల ఆగ్రహం
హిందూపురంలో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న బీకే పార్థసారథి, తెలుగు మహిళలు

అనంతపురం, హిందూపురంలో నిరసన

అనంతపురం వైద్యం, జూలై 22: రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచడంపై తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లాలో గురువారం తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. హిందూపురంలో ఆందోళనకు టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి హాజరయ్యా రు. అన్ని రకాలు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచేస్తూ రాష్ట్ర ప్రజలపై పన్నులభారం మోపుతున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దే దించుదామని బీకే అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్రమ్మ, ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంత పార్లమెంటు పరిధిలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. అనంతపురం నియోజకవర్గ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు వినూత్న నిరసన తెలిపారు. గ్యాస్‌ సిలిండర్లకు పూజలు చేసి, పూలమాలలు వేసి, ధరలు తగ్గించి, ప్రజల కడుపు నింపాలని నిరసన చేపట్టారు. తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీ నేతృత్వంలో నిరసన చేపట్టగా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రియాంక హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ధరల పెంపుతో పేదలతోపాటు మధ్య తరగతి కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయన్నారు. గ్యాస్‌ ధరలు రెట్టింపు చేశారన్నారు. మంచి నూనె ధర మూడింతలు పెరిగిందన్నారు. కందిపప్పు, చక్కర ఇతర నిత్యావసర సరుకులు, కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కరోనాతో ఉపాధిలేక కష్టాలు పడుతున్న వారికి ఈ ధరల పెరుగుదల పెనుభారంగా మారిందన్నారు. వెంటనే ధరలు తగ్గించాలనీ, లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో తెలుగు మహిళలు జానకి, బోయ సరోజమ్మ, లక్ష్మీదేవమ్మ, మనెమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-23T07:00:06+05:30 IST