ఓటరు నమోదు, సవరణలకు 6440 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-11-29T06:56:32+05:30 IST

జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణలకు 6440 దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఈ ప్రక్రియకు శ్రీ కారం చుట్టారు.

ఓటరు నమోదు, సవరణలకు 6440 దరఖాస్తులు

అనంతపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణలకు 6440 దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఈ ప్రక్రియకు శ్రీ కారం చుట్టారు. కొత్తగా ఓటు నమోదు, ఓటరు కార్డు లో మార్పులుచేర్పులకు సంబంధించి బీఎల్‌ఓలు దరఖాస్తులు స్వీకరించారు. మరికొందరు ఆన్‌లైన్‌ ద్వారా నేషనల్‌ ఓటరు సర్వీస్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, ఓటు తొలగించుకునేందుకు ఫారం-7, ఓటరు జాబితాలో సవరణ కోసం ఫారం-8, ఒకే నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరొక పోలింగ్‌ కేంద్రానికి ఓటు మార్చుకునేందుకు ఫారం-8ఏను సమర్పించారు. ఈ నేపథ్యంలో తొలిరోజు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 6440 ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగా ఓటరు నమోదుకు 4182, ఓటు తొలగించుకునేందుకు 1388, ఓటరు జాబితాలో సవరణకు 529, ఓటు మార్చుకునేందుకు 237 దరఖాస్తులందాయి. వీటిలో 826 దరఖాస్తులను పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. రాయదుర్గంలో 661, ఉరవకొండ 858, గుంతకల్లు 202, తాడిపత్రిలో 581, శింగనమల 225, అనంతపురం అర్బన్‌ 208, కళ్యాణదుర్గం 1080, రాప్తాడు 244, మడకశిర 544, హిందూపురం 676, పెనుకొండ 478, పుట్టపర్తి 186, ధర్మవరం 294, కదిరి 203 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారమూ ఫిర్యాదులను స్వీకరించనున్నారు. డిసెంబరు 12, 13 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎన్నికల విభాగాధికారులు తెలిపారు.


Updated Date - 2020-11-29T06:56:32+05:30 IST