Abn logo
Sep 19 2021 @ 01:30AM

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

జేఎనటీయూలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు

నేడు ‘పరిషత్‌’ ఫలితాలు

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఓట్ల లెక్కింపునకు 3700 మంది సిబ్బంది  

ఉదయం 8 గంటలకు ప్రారంభం

తేలనున్న 2278 మంది భవితవ్యం

అనంతపురం విద్య, సెప్టెంబరు 18: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. 5 మాసాలకుపైగా బాక్సుల్లో మగ్గుతున్న బ్యాలెట్‌ పేపర్లు ఎట్టకేలకు బయట పడనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లావ్యాప్తంగా 96 కేంద్రాల్లో కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.


3,700 మంది సిబ్బంది నియామకం

జిల్లావ్యాప్తంగా 11 ప్రాంతాల్లో 17 రిసెప్షన్‌ సెంటర్లలో భద్రపర్చిన బ్యాలెట్‌ బాక్సులను 96 కౌంటింగ్‌ హాళ్లకు ఆదివారం ఉదయం తరలించనున్నారు. 8 గంటల తర్వాత కౌంటింగ్‌ ప్రారంభించనున్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 925 మందిని, సహాయకులుగా మరో 2,775 మందిని కలిపి మొత్తం 3,700 మందిని నియమించారు.


ఏర్పాట్లు పూర్తి...

జిల్లాలోని 96 కౌంటింగ్‌ హాళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. 63 సా్ట్రంగ్‌రూమ్స్‌, 96 కౌంటింగ్‌ హాళ్ల వద్ద భారీగా బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అమర్చారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి, ఏజెంట్లకు గుర్తింపు కార్డులను ఆర్‌ఓలు, ఏఆర్వోలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు.  62 జడ్పీటీసీ స్థానాలకు 249 మంది, 781 ఎంపీటీసీ స్థానాలకు 2029 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారంతా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. నేటితో వారి ఎదురుచూపులకు తెరపడనుంది.


నేడు మద్యం విక్రయాలు బంద్‌

అనంతపురం క్రైం: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ చేపట్లే ప్రాంతాల్లో ఆదివారం పూర్తిగా మద్యం విక్రయాలు బంద్‌ చేస్తున్నట్లు డిపో మేనేజర్‌ శ్రవణ్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కుమరేశ్వరన ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని పలు మున్సిపాల్టీల పరిధిలో జరిగే కౌంటింగ్‌ ప్రాంతాలకు ఐదు కిలోమీటర్లలోపు ఉండే ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలోనూ మద్యం విక్రయాలు బంద్‌ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

పరిషత ఎన్నికల కౌంటింగ్‌ సమాచార సేకరణకు జిల్లా పరిషత్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఐదు డివిజన్లకు సంబంధించి ఆరుగురు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లను, వారి సహాయకులుగా మరో 24 మందిని నియమిస్తూ జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా జడ్పీలోని సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఉంటూ.. గంటగంటకు అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు రిపోర్టులు అందిస్తారు.

కళ్యాణదుర్గంలో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం  

కళ్యాణదుర్గం: జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఓట్ల లెక్కింపునకు సర్వం సి ద్ధం చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎ స్పీ ఫక్కీరప్ప తెలిపారు. శనివారం కళ్యాణదుర్గం ప్ర భుత్వ జూనియర్‌ కళాశాల, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను వారు విడివిడిగా పరిశీలించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాల కౌంటింగ్‌ కళ్యాణదుర్గంలో జరగనున్నాయి. మం డలాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్‌ నిర్వహణపై రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు, రాజకీయ పార్టీలకు ఎన్నికల కౌంటింగ్‌  నియమావళిని తెలియజేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను వెల్లడించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద కొవిడ్‌ పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్‌ జేసీ నిశాంతి, ఆర్డీఓ నిశాంతరెడ్డి, డీఎస్పీ అంథో నప్ప, సీఐలు శ్రీనివాసులు, తేజోమూర్తి, తహసీల్దార్‌ బ్రహ్మయ్య పాల్గొన్నారు. 


భద్రతపై ఆరాతీస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

పటిష్ట భద్రత

ఆయా ప్రాంతాల్లో 114 సెక్షన, 

30 పోలీసుయాక్ట్‌.. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కౌంటింగ్‌కు సంబంధించిన భద్రత, సిబ్బంది పనితీరును శనివారం పరిశీలించారు. అక్కడికక్కడే సిబ్బందితో ఆయా ప్రాం తాల వారీగా సమీక్షించి, ప్రశాంతంగా కౌంటింగ్‌ పక్రియ కొనసాగే విధం గా తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షనతోపాటు 30 పోలీసు యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు వివరించారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు నిత్యం పోలీసు నిఘాతోపాటు భద్రత అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్స్‌, నేర చరిత కలిగిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.


అభ్యర్థులకు హెచ్చరికలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల అధికారులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించరాదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలలో బాధ్యతగా మెలగాలన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత వి జయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచాలు కాల్చడం వంటివి చేయరాదని హెచ్చరించారు. ఓడిపోయినా వారిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం, ప్రేరేపించడం వంటివి చేయరాదన్నారు.


పటిష్ట బందోబస్తు

జిల్లావ్యాప్తంగా 17 కేంద్రాల వద్ద కౌంటింగ్‌ పక్రియ ప్రశాంతంగా సాగేలా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ముగ్గురు ఏఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 59 మంది సీఐలు, 123 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, 12 మంది మహిళా ఎస్‌ఐలు, 703 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 24 మంది మహిళా ఏఎ్‌సఐలు, మహిళా హెడ్‌ కానిస్టేబుళ్లు, 712 కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా కానిస్టేబుళ్లు, 495 మంది హోంగార్డులు, 14 మంది మహిళా హోంగార్డులు, 191 మంది ఏఆర్‌ సిబ్బంది, మరో 8 మంది మహిళా ఏఆర్‌ సిబ్బందితోపాటు ఆరు ఏపీఎస్పీ ప్లటూన్లు, 14 స్పెషల్‌ పార్టీ బృందాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోనల ద్వారా ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.


రేపటి స్పందన రద్దు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 18: స్థానిక కలెక్టరేట్‌లో ఈనెల 20న నిర్వహించాల్సిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ విధులకు అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామనీ, దీనిని ప్రజలు గమనించాలని కోరారు.