Advertisement

‘అత్రంగి రే’ Dhanush ఎంగేజ్‌మెంట్‌లో సారా డ్యాన్స్.. కరీనాని, అమృతా సింగ్‌ని దింపేశావంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోలుగా.. అందాల తార సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. ఈ చిత్రంలోని మొదటి సాంగ్‌ ‘చకా చక్’ని నవంబర్ 29న విడుదల చేశారు మేకర్స్. ధనుష్ ఎంగేజ్‌మెంట్‌లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తుంది సారా.


‘భర్త నిశ్చితార్థంలో ఉత్సాహంగా ఉన్న ఒకే ఒక భార్యని నేనే కావొచ్చు’ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. సౌతిండియా పద్ధతిలో సాగే ఈ సాంగ్‌లో ధనుష్‌ని ఆటపట్టిస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ సాంగ్ ప్రొమోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సారా.. ‘ప్రతి బిహారీ అమ్మాయి పెళ్లిలో ప్లే చేయండి.. ఖచ్చితంగా ఎంతో సరాదాగా ఉంటుంద’ని హామీ ఇచ్చింది ఈ భామ. యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.


‘ఈ పాట రాక్‌స్టార్ కటియా కరూన్‌ని గుర్త చేస్తోంద‌’ కొందరు కామెంట్ పెట్టగా.. ‘బ్యాక్‌గ్రౌండ్, అలంకారం, పెళ్లి, డ్యాన్స్ అన్నీ చల్కా పాటను, సారా అందులో నటించిన రాణి ముఖర్జీని గుర్తు చేస్తున్నాయ‌’ని రాసుకొచ్చాడు. మరో ఫ్యాన్ అయితే.. ‘సారా చాలా బాగా చేసింది. కరీనా కపూర్, తన తల్లి అమృతా సింగ్‌ను కలిపితే ఈ బ్యూటీ. చూడడానికి తల్లిలా, నటన కరీనాలా అనిపిస్తోంద’ని చెప్పాడు. ఈ పాటలో సారా హావాభావాలు, నటన, డ్యాన్స్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.


అయితే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో వారి మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ అందరిని ఆకట్టుకుంది. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.


Advertisement

Bollywoodమరిన్ని...