బ్రహ్మాండోత్సవం

ABN , First Publish Date - 2021-10-26T06:53:16+05:30 IST

ఆత్రేయపురం, అక్టోబరు 25: వాడపల్లి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మి ది రోజులపాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. కరోనా నిబంధనల మేరకే ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ఫలపుష్పాలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. తొలిరోజు ఆలయ మండపంలో ఉత్సవమూర్తులు కొ

బ్రహ్మాండోత్సవం
ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఉత్సవమూర్తులు

ఆత్రేయపురం, అక్టోబరు 25: వాడపల్లి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మి ది రోజులపాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. కరోనా నిబంధనల మేరకే ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ఫలపుష్పాలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. తొలిరోజు ఆలయ మండపంలో ఉత్సవమూర్తులు కొలువై ఉండి ప్రత్యేక పూజలందుకున్నారు. ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు దంపతులు, ధర్మకర్తలు కూడా స్వామివారి బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఇక వేకువజామునే స్వస్తివచనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, అకల్మషహోమం, విశేషార్చన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం ధ్వజారోహణం వద్ద ధ్వజపతాక హోమాలు, నవమూర్తి ఆరాధన, భేరీపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తులను ఆహ్వానించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేశారు. శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఘనంగా శేషవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 8 గంటలకు పరమపదనాఽథుడి అలంకారంలో స్వామివారి శేష వాహనసేవ కనుల పండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఏడు తలల శేషవాహనంపై పరమపదనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేరళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ, విద్యుత్‌ వెలుగుల నడుమ స్వామివారు పుర మాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దం పతులు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. అలాగే ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి దంపతులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.


నేడు హంస వాహనసేవ

రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, ప్రధాన హోమాలు, రాత్రి సరస్వతి  అలంకరణతో హంస వాహనసేవ నిర్వహిస్తారు.

Updated Date - 2021-10-26T06:53:16+05:30 IST