Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ శాఖ అధికారులపై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల దాడి

లైన్‌మన్‌కు గాయాలు, అంబులెన్స్‌లో తరలింపు 

విద్యుత్‌ సిబ్బంది ధర్నా, 5 గంటల పాటు సరఫరా నిలిపివేత 

చెన్నూరు, డిసెంబరు 6 : చెన్నూరు పట్టణంలో విద్యుత్‌శాఖ అధికారులపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు సోమవారం దాడికి పాల్పడ్డారు. పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించగా వీరికి ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ ఉప కేంద్రం ఖాళీ స్థలంలో షెడ్ల నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ అధికారులు నిర్ణయించారు. షెడ్ల నిర్మాణానికి మున్సిపల్‌ కమి షనర్‌ ఖాజమొహిజోద్దీన్‌, చైర్‌పర్సన్‌ భర్త రాంలాల్‌గిల్డా, పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద భూమి పూజ చేసేందుకు ప్రయత్నించారు. విద్యుత్‌ శాఖ ఏఈ రామ్మూర్తితోపాటు జూనియర్‌ లైన్‌మెన్లు, సిబ్బంది అక్కడకు చేరుకొని తమ శాఖ అధికారుల ఉత్తర్వులు లేకుండా షెడ్ల నిర్మాణానికి భూమి పూజ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కౌన్సిలర్లు రేవెల్లి మహేష్‌, వేల్పుల సుధాకర్‌, జగన్నాథుల శ్రీనివాస్‌, మరో కౌన్సిలర్‌ భర్త లక్ష్మణ్‌ జూనియర్‌ లైన్‌మెన్లు సృజ న్‌, పాషాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సృజన్‌కు తీవ్ర గాయాలు కాగా  అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యుత్‌ సిబ్బంది సర ఫరా నిలిపివేసి కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు 5 గంటలపాటు  విద్యు త్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రతిపక్షాలు, ప్రజలు సబ్‌స్టేషన్‌కు చేరుకొ న్నారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, సీఐ ప్రవీణ్‌కుమార్‌ రంగంలోకి దిగి విద్యుత్‌ సిబ్బందితో చర్చలు జరిపారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సాయంత్రం 6 గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులు చేరుకొని చర్చలు జరుపుతున్నారు.  

Advertisement
Advertisement