ఓయూ జేఏసీ నేతపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడి

ABN , First Publish Date - 2021-06-23T06:33:18+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత జటంగి సురే్‌షయాదవ్‌పై టీఆర్‌ఎ్‌సకు చెందిన నేతలు మంగళవారం రాత్రికి దాడికి పాల్పడ్డారు

ఓయూ జేఏసీ నేతపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడి
కమిలిన సురేష్‌ మెడ, చెవి

సూర్యాపేట, జూన్‌ 22 : ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత జటంగి సురే్‌షయాదవ్‌పై టీఆర్‌ఎ్‌సకు చెందిన నేతలు మంగళవారం రాత్రికి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహడ్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజులుగా పాతర్లపహడ్‌ గ్రామంలో గంగదేవమ్మ జాతర జరుగుతోంది. మంగళవారం సాయంత్రం జాతర ముగింపు సమయంలో దేవతను దర్శించుకునేందుకు ఒంటరిగా సురేష్‌ వెళ్లాడు. అదేగ్రామానికి చెందిన మిత్రుడు ఆహ్వానం మేరకు నూతనకల్‌ మండలం మిర్యాల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు కనకటి వెంకన్న 20మందితో కలిసి మద్యం సేవిస్తూ ఉన్నాడు. సురేష్‌ వారికి ఒంటరిగా కనబడడంతో పాతకక్షలను మనసులో పెట్టుకుని దాడికి పాల్పడ్డాడు. అద్దంకి దయాకర్‌, ఈటెల రాజేందర్‌లకు మద్దతు ఇస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులను తిడతావా అంటూ సురే్‌షపై దాడికి పాల్పడ్డారు. వారిని వదిలించుకుని సురేష్‌ ప్రాణభయంతో పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని వారించే ప్రయత్నంలో సురేష్‌ సోదరుడు మహే్‌షపైనా దాడి చేశారు. గ్రామస్థులు వారిని వారించగా వెళ్లిపోయారు. ఈ దాడిలో సురే్‌షకు, అతడి సోదరుడు మహే్‌షకు తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సురే్‌షను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న సురే్‌షను మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఫోన్‌లో పరామర్శించారు. 

Updated Date - 2021-06-23T06:33:18+05:30 IST