Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ గూండాల దాడి.. దారుణం: అచ్చెన్నాయుడు

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై  వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసిందన్నారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమైన చర్య అని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని  చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి.. ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు.


వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా.. అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా.. అంటూ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా.. లేక గూండానా.. అంటూ దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి , జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు గారి ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటని పేర్కొన్నారు.


దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం అరాచక పాలనను గుర్తుకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని అచ్చెన్నాయడు హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement