బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

ABN , First Publish Date - 2021-04-08T00:38:39+05:30 IST

వీడియోలో దిలీప్ ఘోష్‌కి చెందిన కాన్వాయ్‌లోని ఒక కారు అద్దం పగిలి ఉంది. రాయితో బలంగా కొట్టడం వల్ల ఆ అద్దం పగిలిందని బీజేపీ నేతలు అంటున్నారు. అద్దం పగిలినప్పటికీ కాన్వాయ్‌ని ఆపకుండా ముందుకు వెళ్లారు

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై బుధవారం దాడి జరిగింది. కూచ్ బెహార్ జిల్లాలోని సిటాల్‌కుచి ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆయన కారుపై కొంత మంది రాళ్లు విసిరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో దిలీప్ ఘోష్ షేర్ చేశారు.


వీడియోలో దిలీప్ ఘోష్‌కి చెందిన కాన్వాయ్‌లోని ఒక కారు అద్దం పగిలి ఉంది. రాయితో బలంగా కొట్టడం వల్ల ఆ అద్దం పగిలిందని బీజేపీ నేతలు అంటున్నారు. అద్దం పగిలినప్పటికీ కాన్వాయ్‌ని ఆపకుండా ముందుకు వెళ్లారు. అయితే తనపై దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలేనని దిలీప్ ఘోష్ ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇదిలా ఉంటే.. ఇదే జిల్లాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రెమో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం.



Updated Date - 2021-04-08T00:38:39+05:30 IST