రిపోర్టర్‌పై దాడికి నిరసనగా ధర్నా

ABN , First Publish Date - 2021-06-24T04:50:42+05:30 IST

కరప, జూన్‌ 23: తహశీల్దార్‌ కార్యాలయానికి ఎదురుగా బుధవారం ఒక చానల్‌ రిపోర్టర్‌ ఎంవీరకుమార్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడ రూరల్‌ పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. కరప గ్రామానికి చెందిన వీరకుమార్‌ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కారు

రిపోర్టర్‌పై దాడికి నిరసనగా ధర్నా
కరపలో ఎస్‌ఐ రమే్‌షబాబుకు వినతిపత్రం ఇస్తున్న పాత్రికేయులు

కరప, జూన్‌ 23: తహశీల్దార్‌ కార్యాలయానికి ఎదురుగా బుధవారం ఒక చానల్‌ రిపోర్టర్‌ ఎంవీరకుమార్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడ రూరల్‌ పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. కరప గ్రామానికి చెందిన వీరకుమార్‌ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కారులో కరప వచ్చి తనను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించి, కర్రలతో బ్లేడ్‌తో దాడి చేసి హత్యాయత్నం చేసినట్టు తెలి పారు. కరప పోలీసుస్టేషన్‌లో  ఫిర్యాదు చేసి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకు న్నానన్నారు. వీరకుమార్‌కు మద్దతుగా మండల పాత్రికేయులు ధర్నా చేసి కరప ఎస్‌ఐ డి రమే్‌షబాబుకు వినతిపత్రం ఇచ్చారు. వీరకుమార్‌పై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఫిటీషన్‌లో కోరారు. మండల పాత్రికేయులు సాంబశివరావు, శోభన్‌బాబు, సత్తిబాబు, రామలింగేశ్వరావు, చంద్రననగేష్‌, మోహన్‌, చక్రరావు, ప్రకాష్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:50:42+05:30 IST