Abn logo
Sep 21 2021 @ 23:18PM

దంపతులపై దాడి.. ఘటనపై డీఎస్పీ విచారణ

ఘటనా స్థలం వద్ద విచారణ చేపడుతున్న డీఎస్పీ కరుణాకర్‌

చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: మండలంలోని గంగాపూర్‌ గ్రామానికి చెందిన అంజన్న, మౌనిక దంపతులు సోమవారం పనిమీద కాగజ్‌నగర్‌కి వెళ్లి బైక్‌పై రాత్రి 7గంటలకు తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం వారు కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌ కౌటాల సీఐ బుద్ధే స్వామితో కలిసి ఘటన జరిగిన కడంబా అటవీ ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించారు. దంపతులపై దాడి చేసిన దుండగులు వారి వద్ద నుంచి ఎలాంటి వస్తువులు చోరీ చేయలేదని కౌటాల సీఐ బుద్ధే స్వామి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేప డుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరివెంట చింతల మానేపల్లి, ఈస్‌గాం ఎస్సైలు సందీప్‌కుమార్‌, సందీప్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.