గండికోట ఏపీ టూరిజం హోటల్‌ ఉద్యోగిపై దాడి

ABN , First Publish Date - 2022-01-24T05:01:20+05:30 IST

జమ్మలమడుగు మండలంలోని గండికోట ఏపీ టూరిజం హోటల్‌లో శనివారం రాత్రి అక్కడ పనిచేసే హౌస్‌కీపింగ్‌ ఉద్యోగి యాకోబ్‌ ను అదే గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు.

గండికోట ఏపీ టూరిజం హోటల్‌ ఉద్యోగిపై దాడి

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 23: జమ్మలమడుగు మండలంలోని గండికోట ఏపీ టూరిజం హోటల్‌లో శనివారం రాత్రి అక్కడ పనిచేసే హౌస్‌కీపింగ్‌ ఉద్యోగి యాకోబ్‌ ను అదే గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టి  గాయపరిచారు. ఆదివారం ఉదయం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి తనపై కొందరు దాడి చేసి రక్తగాయాలు లేకుండా తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ ఘటనకు సంబంధించి జమ్మలమడుగు అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. తనను గాయపరిచిన వారిని సీసీ కెమెరాల్లో పోలీసు అధికారులు పరిశీలించి వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. 

భార్యను రోకలిబడెతో కొట్టి గాయపరిచిన భర్త


జమ్మలమడుగు రూరల్‌, జనవరి 23: మండలంలోని అనంతగిరి గ్రామంలో ఆదివా రం బాలమ్మను ఆమె భర్త కొండయ్య తలపై రోకలిబడెతో కొట్టి గాయపరిచాడు. పోలీసుల వివరాల మేరకు... బాలమ్మ అనంతగిరి గ్రామానికి చెందినది. కుటుంబ కలహాల వలన భర్త కొండయ్య భార్యపై ఉదయాన్నే రోకలిబడెతో కొట్టి గాయపరిచారు. గాయపడిన మహిళను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయంలో భర్త కొండయ్య కూడా విషద్రావణం తాగి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ఈయనను జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-24T05:01:20+05:30 IST