Abn logo
Apr 8 2021 @ 03:16AM

వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని దాడి!

  • -పోలీసులకు దళితుల ఫిర్యాదు

ఉంగుటూరు, ఏప్రిల్‌ 7: ‘‘ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశామనే నెపంతో మంగళవారం రాత్రి కొంతమంది యువకులు మాపై దాడి చేశారు’’ అని దళిత సామాజిక వర్గానికి చెందిన దారం వెంకటేశ్వరరావు, దారం మార్తరత్నం, దారం కాంతారత్నం, మద్దాలి మహంకాళి, దారం మరియమ్మ వాపోయారు.  వీరిని పోలీసులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై చేబ్రోలు ఎస్‌ఐ వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలను రాజకీయ కోణంలో చూస్తున్నారని,  దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement